ఆసక్తి రేకెత్తిస్తున్న 'అమిగోస్‌' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

Kalyan Ram Amigos First Look Out.బింబిసార చిత్రంతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అందుకున్నాడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Nov 2022 11:26 AM IST
ఆసక్తి రేకెత్తిస్తున్న అమిగోస్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

చాలా రోజుల త‌రువాత 'బింబిసార' చిత్రంతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అందుకున్నాడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. అదే ఊపులో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ పుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఒక‌టి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ అండ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ చిత్రానికి 'అమిగోస్' అనే టైటిల్‌ను పెట్టారు. 'బింబిసార' చిత్రంలో డ్యూయ‌ల్ రోల్‌లో అద‌ర‌గొట్టిన క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో త్రి పాత్రాభిన‌యం చేయబోతున్నాడు. ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న అశికా రంగనాథ్ న‌టిస్తోంది. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తుండ‌గా 10 ఏప్రిల్ 2023లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

టైటిల్ పోస్ట‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. ఈ పోస్టర్‌లో కళ్యాణ్‌ రామ్‌ మూడు విభిన్న గెటప్స్‌లలో కనిపిస్తున్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశారు.

Next Story