100 రూపాయలకే కల్కి సినిమా టికెట్.. ఈ వీకెండ్ కూడా ప్రభాస్ దే!!
కల్కి 2898 ఏడీ సినిమా విడుదలై ఒక నెల దాటిపోయింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2024 2:15 PM IST100 రూపాయలకే కల్కి సినిమా టికెట్.. ఈ వీకెండ్ కూడా ప్రభాస్ దే!!
కల్కి 2898 ఏడీ సినిమా విడుదలై ఒక నెల దాటిపోయింది. ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తూ ఉంది. ఇక ఇప్పుడు సినిమా టికెట్ ధరను 100 రూపాయలకు తగ్గించడంతో కలెక్షన్స్ పరంగా మరోసారి అద్భుతాలు చేస్తోంది. శుక్రవారం, ఈ చిత్రం బుక్ మై షోలో 30 వేలకు పైగా టిక్కెట్లను విక్రయించింది. ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. బాలీవుడ్ సినిమాలలో విడుదలైన 3 వారాలు లేదా 4 వారాల తర్వాత టిక్కెట్ ధరలను తగ్గించడం అనే ట్రెండ్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మరోసారి నార్త్ ఆడియన్స్ కల్కిని చూడడానికి ఎగబడుతూ ఉన్నారు. ఆగస్టు 2 నుండి ఆగస్టు 9 వరకూ 100 రూపాయలకే కల్కి సినిమా టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
3-4 వారాల తర్వాత టిక్కెట్ ధరను తగ్గించడంతో సినిమాకు వచ్చే జనం సంఖ్య మరింత పెరుగుతుంది. పెద్ద స్క్రీన్‌లలో రిపీట్ వ్యూయర్‌షిప్‌ను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. విడుదలైన 8 వారాల తర్వాత OTTలో సినిమాలను విడుదల చేయడం, 3-4 వారాల తర్వాత తక్కువ టిక్కెట్ ధరలు పెట్టడం అనేది బాలీవుడ్‌లో కొనసాగుతూ ఉంది.