కల్కి: 2898 AD: అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతోంది!!

కల్కి: 2898 AD సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు

By Medi Samrat  Published on  7 Jun 2024 7:45 PM IST
కల్కి: 2898 AD: అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతోంది!!

కల్కి: 2898 AD సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఇతిహాసంలో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులలో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి 'బుజ్జి & భైరవ' యానిమేషన్ సిరీస్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం బుకింగ్‌లు రెండు రోజుల క్రితం అమెరికాలో తెరిచారు. దీంతో ఈ సినిమా టికెట్స్ కోసం అభిమానులు క్యూ కడుతూ ఉన్నారు. ప్రీ-సేల్స్ ఇప్పటికే $300K దాటాయి.


సినిమా విడుదలకు మూడు వారాలు ఉన్నా.. ఇంకా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాకపోయినా మంచి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయని అనుకోవచ్చు. ట్రైలర్ బాగుండి.. సినిమాకు మంచి టాక్ వస్తే మాత్రం 'కల్కి: 2898 AD' సినిమాకు అమెరికాలో మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ విభాగం అంచనా వేసింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Next Story