ఆ వ్యాధితో బాధ‌పడున్న‌ట్లు చెప్పిన కాజ‌ల్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌

Kajal Aggarwal reveals she has asthma.కాజల్ తాజాగా తనకున్న అనారోగ్య సమస్యను అభిమానులతో చెప్పుకుంది. ఈ విషయం అభిమానులను షాక్ కు గురి చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2021 5:48 PM IST
ఆ వ్యాధితో బాధ‌పడున్న‌ట్లు చెప్పిన కాజ‌ల్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌

గత సంవత్సరం టాలీవుడ్ చందమామ కాజల్‌ తన చిన్ననాటి మిత్రుడైన గౌతమ్‌ కిచ్లుని పెళ్లిని చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. వివాహం అయిన తర్వాత కాజల్‌ తన భర్తతో కలిసి మాల్దివులు పర్యటనకు వెళ్ళింది. వివాహం చేసుకున్న తర్వాత ఈ ముద్దుగుమ్మ తన పేరును ఇన్‌స్టాగ్రామ్‌లో మార్చుకుంది. తన భర్త పేరు, తన ఇంటి పేరు కలిసి వచ్చేలా 'కాజల్‌ ఎ కిచ్లు' అని పెట్టుకుంది.


కాజల్ తాజాగా తనకున్న అనారోగ్య సమస్యను అభిమానులతో చెప్పుకుంది. ఈ విషయం అభిమానులను షాక్ కు గురి చేసింది. ఐదేళ్ల వయసు నుంచి తాను బ్రాంకియల్ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నానని కాజల్ చెప్పింది. శీతాకాలంలో వ్యాధి మరింత ఎక్కువవుతుందని ఈ వ్యాధి వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపింది. ఆస్తమా వల్ల ఆహారం విషయంలో కూడా తాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని.. ఆస్తమా నుంచి బయటపడేందుకు తాను ఇన్ హేలర్ వాడానని కాజల్ తెలిపింది. ఇన్ హేలర్ వాడేందుకు చాలా మంది సిగ్గు పడుతుంటారని.. ఎవరో ఏదో అనుకుంటారని భావించకూడదని, ఇన్ హేలర్ లు ఉపయోగించాలని సూచించింది. కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ తెరకెక్కుతోంది. మరిన్ని సినిమాలతో పాటూ, వెబ్ సిరీస్ లో కూడా కాజల్ నటిస్తోంది.




Next Story