బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాక కాజ‌ల్ తొలి పోస్ట్.. 'ఆ క్ష‌ణాలు వ‌ర్ణించ‌లేనివి'

Kajal Aggarwal Emotional post after delivery.టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఏప్రిల్ 19న మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2022 6:59 AM GMT
బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాక కాజ‌ల్ తొలి పోస్ట్.. ఆ క్ష‌ణాలు వ‌ర్ణించ‌లేనివి

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఏప్రిల్ 19న మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కాజ‌ల్ మాతృత్వ‌పు మ‌ధురానుభూతుల‌ను అనుభ‌విస్తోంది. తల్లి అయిన అనంత‌రం కాజ‌ల్ తొలి సారి సోష‌ల్ మీడియాలో ఓ పోస్టును పెట్టింది. త‌న డెలివ‌రీ అనుభ‌వాన్ని, ఎదుర్కొన్న క‌ష్టాలు, బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లుకుతూ కాజ‌ల్ ఆ పోస్టును పెట్టింది.

'నా బిడ్డ నీల్‌ను ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నీల్‌ను మొద‌టి సారి ఎత్తుకున్న‌ప్ప‌టి క్ష‌ణం నా జీవితంలో ఎన్న‌టికి మ‌రిచిపోలేనిది. ఆ స‌మ‌యంలో నేను ప్రేమ‌కు సంబంధించిన ఓ అంద‌మైన‌, మ‌ధురానుభూతికి లోనైయ్యాను. జీవితాంతం నిర్వ‌ర్తించాల్సిన బాధ్య‌త‌ను గుర్తు గుర్తు చేసుకున్నాను. నిజానికి ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. మూడు రోజులు నిద్ర‌లేని రాత్రులు గ‌డిపాను. ఎప్పుడెప్పుడు నా బిడ్డ‌ను చూస్తానా, ఎత్తుకుంటానా అన్న ఆతృతను ఆనందంగా అనుభ‌వించాను. ఇక ప్ర‌తి రోజు మ‌ధుర‌మైన కౌగిలింత‌లు, నా బిడ్డ క‌ళ్ల‌లోకి ప్రేమ‌గా చూడ‌డం, త‌న‌ని హ‌త్తుకోవ‌డం, చిన్న ముద్దులు, మేము ఇద్దరం మాత్రమే ఉన్నప్పుడు ఎదుగుతూ, నేర్చుకోవ‌డం, ఒక‌రినొక‌రం ఆవిష్కరించుకొంటున్నాం. ఈ అద్భుత‌మైన ప్ర‌యాణాన్ని ఆనందంగా, నిశ‌బ్దంగా సాగిస్తున్నాను. బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాక ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌క‌పోవ‌చ్చు. కానీ ఖ‌చ్చితంగా అందంగా ఉంటుంది. 'అని కాజ‌ల్ రాసుకొచ్చింది.

Next Story
Share it