బాడీ షేమింగ్ పై కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు

Kajal Aggarwal claps back at trolls body-shaming women during pregnancy.ల‌క్ష్మి క‌ళ్యాణం చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2022 1:07 PM IST
బాడీ షేమింగ్ పై కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు

'ల‌క్ష్మి క‌ళ్యాణం' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కాజ‌ల్‌. కెరీర్ మొద‌లై దాదాపు 16 సంవ‌త్స‌రాలు కావొస్తున్న.. త‌న న‌ట‌న‌, అందంతో దూసుకుపోతుంది. 2020 అక్టోబ‌ర్‌లో త‌న స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకుంది. పెళ్లైన‌ప్ప‌టికీ కూడా వ‌రుసగా చిత్రాల‌ను చేస్తూ పుల్ బిజీగా ఉంది. కాగా.. కాజ‌ల్ ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి అన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌స్తుతం సినిమాల‌కు కాస్త విరామం ఇచ్చింది. హెల్త్ విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. కాజ‌ల్ బేబీ బంప్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. అయితే.. కొంద‌రు ఆక‌తాయిలు కాజ‌ల్ బాడీ షేమింగ్‌పై కామెంట్లు చేస్తున్నారు. దీంతో వారికి కాజ‌ల్ త‌న‌దైన శైలిలో త‌గిన స‌మాధానం చెప్పింది. బాడీ షేమింగ్ చేసే కొందరు మూర్ఖులు కోసమే ఇది అంటూ సోష‌ల్ మీడియాలో సుధీర్ఘ‌మైన పోస్ట్ చేసింది.

'నా జీవితంలో చాలా మంచి మార్పులు ఎదుర్కొంటున్నాను. అందులోనూ ముఖ్యంగా నా శరీరంలో, కుటుంబంలో, నా వృత్తిలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కామెంట్స్/ బాడీ షేమింగ్ మెసేజెస్/ మీమ్స్ నేను ఎక్కువగా పట్టించుకోను. అందరిపై దయతో ఉండడం నేర్చుకుందాం. నాలాగే పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు, అలాగే ఏ విషయం అర్థం కాని మూర్ఖులు ఉన్నారు. వారి కోసం నేను నా గురించి, నా ఆలోచనల గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో చాలా మార్పులు ఎదురవుతాయి. కొంతమందికి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. మొటిమలు వస్తాయి. మామూలు సమయం కంటే కూడా ఇలాంటి సమయంలో ఎక్కువ అలసిపోతుంటారు. మూడ్ కూడా తొందరగా మారుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో నెగటివ్ ఆలోచనలు అనేవి మన మూడ్ పై ప్రభావం చూపుతాయి. ఇది మన శరీరానికి మంచిది కాదు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ అంతకు ముందు ఉన్న షేప్ కి రావాలి అంటే కష్టమే. కానీ పర్వాలేదు. ఇలాంటి మార్పులు సహజం. వీటివల్ల ఇలాంటి అద్భుతమైన క్షణాల్లో అసౌకర్యానికి గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి చేయకూడదు. ఒక జీవికి జన్మనిస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేను ఈ సమయంలో ఫాలో అవుతున్న కొన్ని పాయింట్స్ కూడా చెబుతున్నాను. ఇవన్నీ మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాను' అని నటి కాజ‌ల్ ముగించింది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి స‌ర‌సన ' ఆచార్'య చిత్రంలో కాజ‌ల్ న‌టించింది. ఈ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బృందా దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా 'హే సినామిక' లో దుల్కర్ సల్మాన్ సరసన కూడా కాజల్ నటిస్తుంది. ఈ చిత్రం మార్చి 3న థియేటర్లలోకి రానుంది.

Next Story