నాగార్జునకు జోడీగా కాజల్ ఫిక్స్
Kajal Agarwal Romance with Nagarjuna.ఈ చిత్రంలో నాగ్ సరసన కాజల్ నటిస్తోంది.
By తోట వంశీ కుమార్
కింగ్ నాగార్జున వేగంగా చిత్రాలను చేస్తున్నాడు. కరోనా విరామం తరువాత వరుసగా సినిమాలను అంగీకరిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన వైల్డ్ డాగ్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం తరువాత నాగార్జున గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో నాగార్జున కనిపించనున్నాడు. ఇందులో నాగార్జున చెల్లిగా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్ పనాగ్ నటిస్తోంది. మేనకోడలి పాత్రలో మలయాళీ నటి అనిఖ నటిస్తోంది.
Thank you :) look forward ! https://t.co/od2cfC7nzy
— Kajal Aggarwal (@MsKajalAggarwal) March 18, 2021
ఇక ఈ చిత్రంలో నాగ్ సరసన కాజల్ నటిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ప్రవీణ్ సత్తారు - నాగార్జున కాంబినేషన్‌లో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్‌లోకి కాజల్‌ను స్వాగతిస్తున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతుండగా.. హైదరాబాద్ షెడ్యూల్ సమయానికి టీంతో జతకట్టనుంది కాజల్. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే.. కాజల్ నటించిన మోసగాళ్లు చిత్రం మార్చి 19న విడుదల కానుండగా.. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటుంది. మరోవైపు చిరంజీవి సరసన ఆచార్య అనే సినిమాలో కథానాయికగా నటిస్తుంది కాజల్.