సీనియర్ నటుడు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే.. మంగళవారం ఉదయం ఆయన మృతి చెందారంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆయన కుమారై రమాదేవి మాట్లాడుతూ.. అవన్ని వదంతులు మాత్రమేనని చెప్పుకొచ్చారు. వీటిని ఎవరూ నమ్మవద్దని కోరారు. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం బాగానే ఉందన్నారు.
అందరితోనూ సత్యనారాయణ మాట్లాడుతున్నారని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. తప్పుడు సమాచారం ప్రచారం చేసి ప్రజలను ఆందోళనకు గురిచేయొద్దని ఆడియో వాయిస్ ద్వారా రమాదేవి చెప్పారు. ఇక సత్యనారాయణ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. సత్యనారాయణ క్రమంగా కోలుకుంటున్నారు. రక్తపోటు అదుపులోకి వస్తోంది. కిడ్నీల పనితీరు మెరుగైంది. ఆయన వెంటిలేటర్ సపోర్ట్‌పై కొనసాగుతున్నారని తెలుస్తుంది.
సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి ఇటీవల స్పందించారు. సత్యనారాయణతో తాను ఫోన్లో మాట్లాడానని.. తన మాటలకు ఆయన ఆనందం వ్యక్తం చేశారని చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే.