చావు కబురు చల్లగా.. 'కదిలే కాలాన్నడిగా' మెలోడీ సాంగ్
Kadhile Kaalannadiga Lyrical Song out.యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం, 'కదిలే కాలాన్నడిగా' మెలోడీ సాంగ్
By తోట వంశీ కుమార్ Published on
23 Feb 2021 1:05 PM GMT

యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం చావు కబురు చల్లగా. డెబ్యూట్ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తికేయ 'బస్తీ బాలరాజు', లావణ్య త్రిపాఠి 'మల్లిక' పాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు లిరికల్ సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'కదిలే కాలాన్నడిగా..ఈ చోటె పరుగాపమని..తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని..స అనే మరో సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ గీతానికి డైరెక్టర్ పెగళ్ళపాటి కౌశిక్ - సనరే కలసి సాహిత్యాన్ని అందించారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చగా.. గౌతమ్ భరద్వాజ్ - షాసా త్రిపాఠి ఆలపించారు. ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story