ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
భారతీయ సినిమా ఖ్యాతిని 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రపంచానికి చాటింది. ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లి చరిత్ర సృష్టించింది.
By అంజి Published on 29 Jun 2023 11:09 AM IST
ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
భారతీయ సినిమా ఖ్యాతిని 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రపంచానికి చాటింది. ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లి చరిత్ర సృష్టించింది. అంతకుముందు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదరగొట్టి.. భారీ కలెక్షన్లను రాబట్టి, రికార్డులు తిరగరాసింది. మార్చిలో భారతీయ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' మొట్టమొదటి ఆస్కార్‌ను గెలుచుకుంది. అయితే ఈ సినిమా ఆస్కార్లు అవార్డులు సాధించడమే కాకుండా, ఇప్పుడా సినిమా యూటిన్ ఏకంగా ఆస్కార్ జ్యూరీ మెంబర్లు అయ్యేంత గొప్ప స్థాయికి తీసుకొచ్చింది. 2024, మార్చిలో జరిగే 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ఇప్పటి నుండే సన్నాహాలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలోనే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAAS), ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను అందించే సంస్థ 398 మంది కొత్త ఆర్టిస్ట్‌లను సభ్యులుగా చేరమని ఆహ్వానించింది. వీరిలో భారతీయ తారలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు కోసం) ఆస్కార్ అవార్డును గెలుచుకున్న స్వరకర్త ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లకు కూడా ఆహ్వానాలు పంపబడ్డాయి. చిత్ర ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్‌లకు కూడా ఆహ్వానం అందింది.
నిర్మాతల కేటగిరీ నుంచి బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్‌కు కూడా స్థానంల లభించింది. ఈ 398 మందిలో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్‌కు చోటు కల్పించారు. మరోవైపు ఆస్కార్ జ్యూరీ మెంబర్లుగా ఎన్టీఆర్, రాంచరణ్‌లకు స్థానం లభించడంతో వారి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వారి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అకాడమీలో సభ్యులుగా ఉండటం వల్ల ఈ ఆర్టిస్ట్‌లు తదుపరి అకాడమీ అవార్డులలో ఓటింగ్ హక్కులను కలిగి ఉంటారు. ఆస్కార్ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక చలనచిత్ర అవార్డులలో ఒకటి.