కమెడియన్‌ను కొట్టబోయిన జడ్జ్..!

Judge Mano Fire on Rakesh.బుల్లితెర‌పై సుదీర్ఘ‌కాలంగా విజ‌యవంతంగా ప్ర‌సారం అవుతున్న కామెడి షో జ‌బ‌ర్థ‌స్త్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Nov 2021 8:33 AM GMT
కమెడియన్‌ను కొట్టబోయిన జడ్జ్..!

బుల్లితెర‌పై సుదీర్ఘ‌కాలంగా విజ‌యవంతంగా ప్ర‌సారం అవుతున్న కామెడి షో జ‌బ‌ర్థ‌స్త్. ఎనిమిదేళ్లుగా ఒకే ర‌క‌మైన ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందుతూ భారీ స్థాయిలో టీఆర్‌పీని ద‌క్కించుకుంటోంది. ప్ర‌తి వారం స‌రికొత్త‌గా ముస్తాబు అవుతూ అల‌రిస్తోంది. ఎంతో మంది టాలెంట్ ఉండి అవ‌కాశం లేద‌ని వాళ్ల‌ని వెలుగులోకి తీసుకువ‌చ్చింది. కొన్ని వంద‌ల మంది ఈ షో ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి పొందుతున్నారు అన‌డంలో సందేహాం లేదు. జ‌బ‌ర్థ‌స్త్ నుంచి నాగ‌బాబు వెళ్లిపోయిన త‌రువాత ఆయ‌న స్థానాన్ని సింగ‌ర్ మ‌నో భ‌ర్తీ చేశార‌నే చెప్పాలి. మ‌నో కూడా మ‌ధ్య మ‌ధ్యలో అద్భుత పంచులు వేస్తూ అల‌రిస్తున్నారు.

అయితే.. ఏమైయిందో ఏమో తెలీదు కానీ.. తాజాగా ఓ స్కిట్ చేస్తున్న సంద‌ర్భంగా కోపంతో ఊగిపోయారు మ‌నో. కమెడియ‌న్ రాకింగ్ రాకేష్‌ను కొట్ట‌బోయారు. 'రాకేష్ మీరంటే నాకు గౌరవం ఉంది. కానీ ఇలా చేస్తారా? ఏం స్టేజ్ ఇది ఏం చేస్తున్నారు' అంటూ సీరియస్ అయ్యారు మ‌నో. అప్పుడు రాకేష్ సారీ చెప్పే ప్రయత్నం చేసినా.. రోజా ఆపినా ఆగకుండా ఆయన దిగి వెళ్లిపోయారు. ఒకానొక దశలో రాకేష్‌ను కొట్టబోయారు. ఇదంతా వ‌చ్చే శుక్ర‌వారం ప్ర‌సారం కాబోతున్న ఎక్స్‌స్ట్రా జ‌బ‌ర్థ‌స్త్ ప్రోమోలో చూపించారు.

ఈ ప్రోమో ప్రారంభంలో అదిరిపోయే పంచుల‌ను చూపించారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌, బుల్లెట్ భాస్క‌ర్ స్కిట్ల‌ను హైలెట్ చేశారు. చివ‌ర్లో మ‌నో ఆగ్ర‌హంతో ఊగిపోవ‌డం చూపించారు. అయితే.. నిజంగా మ‌నో కి కోపం వ‌చ్చిందా..? స్కిట్ లో భాగంగానే ఇదంతం చేశారా అనేది తెలియాలి అంటే శుక్ర‌వారం ప్ర‌సారం అయ్యే ఎక్స్‌స్ట్రా జ‌బ‌ర్థ‌స్త్ వ‌ర‌కు ఆగాల్సిందే.

Next Story
Share it