అఖండ చిత్రం పై ఎన్టీఆర్‌ స్పందన.. ఒక్క‌మాట‌తో చెప్పేశాడుగా..!

Jr NTR's Reaction After Watching Akhanda movie.నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన చిత్రం అఖండ‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2021 4:21 AM GMT
అఖండ చిత్రం పై ఎన్టీఆర్‌ స్పందన.. ఒక్క‌మాట‌తో చెప్పేశాడుగా..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన చిత్రం అఖండ‌. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం నిన్న‌(గురువారం) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజే బ్లాక్ బాస్ట‌ర్ టాక్‌ను తెచ్చుకుంది. ఇక మొద‌టి రోజు ఈ సినిమాను చూసిన ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడు జై బాల‌య్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. నెల‌రోజుల ముందే పండుగ వాతావ‌ర‌ణాన్ని తీసుకువ‌చ్చింద‌ని అంటున్నారు. బ్లాక్ బాస్ట‌ర్ టాక్ సొంతం చేసుకోవ‌డంతో అన్ని థియేట‌ర్ల‌లో హౌస్‌పుల్ బోర్డులు ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. అటు ప్రేక్ష‌కులతో పాటు ఇటు సినీ సెల‌బ్రెటీలు ఈ చిత్రాన్ని చూసి ఫిదా అయిపోతూ.. సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు పెడుతున్నారు. బాలయ్య పెర్ఫామెన్స్‌తో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు.

'అఖండ చిత్రాన్ని ఇప్పుడే చూశా. ఈ అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించినందుకు బాలా బాబాయి తో పాటు చిత్ర బృందం మొత్తానికి అభినంద‌న‌లు. హార్ట్ కోర్ అభిమానులు ఎంజాయ్ చేయడానికి చిత్రంలో ఎన్నో ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి'' అని అంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

అఖండ మూవీ భారీ ఓపెనింగ్స్ సాధించింది అని విన‌డానికి చాలా సంతోషంగా ఉంది. బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీనుల‌తో పాటు అఖండ చిత్ర‌యూనిట్ మొత్తానికి అభినంద‌న‌లు అంటూ మ‌హేష్‌బాబు ట్వీట్ చేశారు.

బాల మామా నుండి ఇప్పటివరకు అత్యుత్తమ మాస్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటైన అఖండను ఇప్పుడే చూశాను. బోయపాటి గారు అనుకున్నది సాధించారు, మాస్ హిస్టీరియాని అత్యుత్తమ బీజీఎమ్‌తో పునర్నిర్వచించినందుకు థమన్ ను ప్రత్యేకంగా అభినందించాలి అంటూ నారా రోహిత్ ట్వీట్ చేశాడు.

Next Story
Share it