ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ బ‌హిరంగ లేఖ‌.. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక‌

JR NTR writes open letter to his fans.జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. మే 20న ఎన్టీఆర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2021 11:08 AM IST
JR NTR

జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. మే 20న ఎన్టీఆర్ 38వ ప‌డిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు అభిమానులు సిద్దం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ అభిమానుల‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌కు లేఖ రాశారు. వేడుక‌ల‌కు ఇది స‌రైన స‌మ‌యం కాద‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ లాక్‌డౌన్ నియ‌మాలు పాటించి ఇంటికే ప‌రిమితం కావాల‌ని.. ప్ర‌స్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని.. త్వ‌ర‌లోనే క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని పేర్కొన్నారు. అభిమానులంద‌రికి పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

లేఖ‌లో ఏముందంటే..?

నా అభిమానులంద‌రికి పేరు పేరున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. గ‌త కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊర‌ట క‌లిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగ‌ల‌ను?

ప్ర‌స్తుతం నేను బాగున్నాను. త్వ‌ర‌లోనే కోలుకొని, కోవిడ్‌ను జ‌యిస్తాను అని ఆశిస్తున్నాను. ప్ర‌తి ఏటా మీరు నా పుట్టిన రోజున చూపే ప్రేమ‌, చేసే సేవా కార్య‌క్ర‌మాలు ఒక ఆశీర్వ‌చనంగా భావిస్తాను. కాని ఈ సంవ‌త్స‌రం ఇంటి ప‌ట్టునే ఉంటూ లాక్ డౌన్ లేదా క‌ర్ఫ్యూ నియ‌మాల‌ను పాటిస్తూ జాగ్ర‌త్త‌గా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక‌.

ఇది వేడుకలు చేసుకునే స‌మ‌యం కాదు. మ‌న‌దేశం క‌రోనాతో యుద్ధం చేస్తుంది. క‌నిపించ‌ని శ‌త్రువుతో అలుపెరుగని పోరాటం చేస్తున్న డాక్ట‌ర్స్, న‌ర్సులు, ఇత‌ర ఫ్రంట్ టైన్ వారియ‌ర్స్‌కు మ‌న సంఘీభావం తెల‌పాలి. ఎంద‌రో త‌మ ప్రాణాల‌ను, జీవ‌నోపాధిని కోల్పోచారు. ఆ కుటుంబాల‌కు కుదిరితే అండ‌గా నిల‌బ‌డాలి.

మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్ర‌త్త‌గా ఉండండి. ఒక‌రికి ఒక‌రం సాయం చేసుకుంటూ, చేత‌నైన ఉప‌కారం చేయండి.

త్వ‌ర‌లో మ‌న‌దేశం ఈ క‌రోనాను జ‌యిస్తుంద‌ని న‌మ్ముతున్నాను. ఆ రోజున మ‌నం అంద‌రం క‌లిసి వేడుక చేసుకుందాం. అప్ప‌టి వ‌ర‌కు మాస్క్ ధ‌రించి జాగ్ర‌త్త‌గా ఉండండి. నా విన్న‌పాన్ని మ‌న్నిస్తార‌ని ఆశిస్తూ మీ ఎన్టీఆర్ అంటూ ఆ లేఖ‌లో రాసుకొచ్చారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ మ‌రో క‌థానాయ‌కుడు. ఆర్ఆర్ఆర్ చిత్రం త‌రువాత ఎన్టీఆర్.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే అవ‌కాశం ఉంది.


Next Story