Junior NTR : ప్ర‌ణ‌తికి ఎన్టీఆర్ స్పెష‌ల్ విషెస్‌

త‌న భార్య‌ ప్ర‌ణ‌తి పుట్టిన రోజు సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్పెష‌ల్ విషెస్ చెప్పారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2023 11:07 AM IST
JR NTR, Pranathi

భార్య ప్ర‌ణ‌తితో ఎన్టీఆర్‌



త‌న భార్య‌ ప్ర‌ణ‌తి పుట్టిన రోజు సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్పెష‌ల్ విషెస్ చెప్పారు. ప్ర‌ణ‌తితో క‌లిసి ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ హ్యాపీ బ‌ర్త్ డే అమ్మ‌లు అంటూ త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేశారు. ఇది చూసిన అభిమానులు ప్ర‌ణ‌తికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ప్రస్తుతం తార‌క్ చేసిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఎన్టీఆర్ కుటుంబానికి సమ‌యం కేటాయిస్తారు అన్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీతో క‌లిసి అప్పుడ‌ప్పుడు విహార‌యాత్ర‌ల‌కు వెలుతుంటారు. ఎన్టీఆర్‌, ప్ర‌ణ‌తి జంట‌కు అభ‌య్ రామ్‌, భార్గ‌వ్ రామ్ అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

ఇదిలా ఉంటే.. గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇటీవల పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించ‌నున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీక‌పూర్ న‌టించ‌నుంది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు జాన్వీ ఎంట్రీ ఇస్తోంది.

Next Story