'ఎవరు మీలో కోటీశ్వరుడు' అంటున్న జూనియర్ ఎన్టీఆర్
JR NTR shoots for Evaru meelo koteeswarudu talk show.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో పుల్ బిజీగా ఉన్నాడు.
By తోట వంశీ కుమార్ Published on 27 Feb 2021 11:42 AMయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో పుల్ బిజీగా ఉన్నాడు. అయినప్పటికి బుల్లితెరపై సందడి చేయడానికి సిద్దమై పోయాడు. ఇప్పటికే బిగ్‌బాస్ సీజన్ 1కి హోస్టుగా వ్యవహరించి.. షో సూపర్ సక్సెస్ కావడంలో కీలక పాత్ర వహించాడు. ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు ఎన్టీఆర్. మళ్లీ ఇన్నాళ్లకు బుల్లితెరపై తన విశ్వరూపం చూపించబోతున్నాడు తారక్. 'ఎవరు మీలో కోటీశ్వరుడు' అంటూ వచ్చేస్తున్నాడు. గతంలో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన 'మీలో ఎవరు కోటిశ్వరుడు'నే కాస్త మార్చి ఇది తీసుకొస్తున్నారు.
అన్నపూర్ణ 7ఎకర్స్‌లో దీనికి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా జరిగింది. ఈ ప్రోమోకు త్రివిక్రమ్ దర్వకత్వం వహించారు. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ పూర్తి కాగానే.. ఎన్టీఆర్ ఈ షోపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో ఏప్రిల్ నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. మార్చి తొలివారం నుంచి ఈ షోకి సంబంధించి ఎంట్రీస్ తీసుకుంటారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగానే జరుగుతుంది. తన సినిమాలతో పాటు ఈ షోకు కూడా డేట్స్ ఇచ్చేసాడు తారక్.
ఒక్కో ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్.. కోటికి పైగా పారితోషికం అందుకోనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షో గతేడాదే మొదలుకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది. ఎంటర్‌టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు.
ఎన్టీఆర్ - నాగార్జున అటు ఇటు
బిగ్ బాస్ తొలి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రెండో సీజన్‌కు నాని. ఆపై రెండు సీజన్స్ కి నాగార్జున హోస్ట్ గా చేశారు. గత ఏడాది కరోనా టైమ్ లో కూడా బిగ్ బాస్ 4 కి విశేష ఆదరణ దక్కింది. ఇక నాగ్ హోస్ట్ గా చేసిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కి కూడా అపూర్వమైన ఆదరణ లభించింది. తాజాగా ఆ ప్రొగ్రాం కాస్త మార్చి.. దానికి ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించనుండడంతో రికార్డులు బద్దలు కావడం ఖాయం అని సదరు ఛానల్ వారు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయా ప్రొగ్రామ్స్‌కి ఇద్దరు పర్మినెంట్ హోస్టులుగా మారిపోతారేమో చూడాలి మరీ.