చేతికి బ్యాండేజ్‌తో క‌నిపించిన ఎన్టీఆర్‌.. ఏమైందంటే..?

Jr NTR right hand finger injured.దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2021 8:42 AM GMT
చేతికి బ్యాండేజ్‌తో క‌నిపించిన ఎన్టీఆర్‌.. ఏమైందంటే..?

దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ త‌న ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభయ్ రామ్, భార్గవ్ రామ్ మధ్య యంగ్ టైగ‌ర్‌ సాంప్రదాయ దుస్తులతో క‌నిపించిన ఈ పిక్ క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మారింది. అయితే.. ఈ ఫోటోలో ఎన్టీఆర్ కుడి చేతికి బ్యాండేజ్‌తో క‌నిపించారు. దీంతో ఎన్టీఆర్‌కు ఏం జ‌రిగిందోన‌ని అభిమానులు కంగారు ప‌డుతున్నారు. ఎవ‌రికి తోచిన విధంగా వారు కామెంట్లు పెడుతున్నారు.

ఇక దీనిపై.. అస‌లు విష‌యం ఏంటి అని ఆరా తీయ‌గా.. ఇటీవ‌ల ఎన్టీఆర్ త‌న నివాసంలోని జిమ్‌లో వ్యాయామం చేస్తుండ‌గా.. చేతికి చిన్న గాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. కుడి చేతి వేలుకు గాయం కావ‌డంతో నాలుగు రోజుల క్రితం వైద్యులు చిన్న స‌ర్జ‌రీ చేశారు. అయితే.. అభిమానులు కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు... ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.

ఇక సినిమాల విషయానికి వ‌స్తే.. ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావ‌డంతో.. నెల రోజుల త‌రువాత ఎన్టీఆర్ త‌న నూత‌న చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కనుంది. కాగా.. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జ‌న‌తాగ్యారేజ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించడంతో.. కొత్త చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.


Next Story
Share it