ఆస్కార్‌ ఉత్తమ నటుడి విభాగం రేసులో ఎన్టీఆర్‌..!

Jr NTR predicted as best actor contender for Oscar 2023 by US magazine.యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఎంత మంచి నటుడో

By M.S.R
Published on : 21 Jan 2023 6:38 PM IST

ఆస్కార్‌ ఉత్తమ నటుడి విభాగం రేసులో ఎన్టీఆర్‌..!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఈ తరం నటుల్లో చాలా బెటర్.. కాదు.. కాదు బెస్ట్ అని చాలా మంది బల్లగుద్ది మరీ చెబుతారు. ఆర్ఆర్ఆర్ కారణంగా ఎన్టీఆర్ నటన గురించి ప్రపంచం మొత్తం తెలిసింది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ నటనకు ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు దక్కాయి. ఆస్కార్‌ రేసులో ఉత్తమ నటుడి విభాగంలో తారక్‌ ఉండొచ్చని కూడా పలువురు భావిస్తూ ఉన్నారు.

అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మ్యాగజైన్‌ ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది టాప్‌-10 బెస్ట్‌ యాక్టర్స్‌ ప్రిడిక్షన్‌ లిస్ట్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో ఎన్టీఆర్‌కు అగ్రస్థానం దక్కింది. టామ్ క్రూజ్, పాల్ డనో, మియా గోత్, పాల్ మెస్కల్, జో క్రవిట్జ్ తదితరుల పేర్లు కూడా టాప్‌-10 లిస్ట్‌లో ఉన్నాయి. ఇక ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. ఇక ఆస్కార్ నామినేషన్స్ కు ఎన్టీఆర్ కూడా వెళితే తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగిపోతుంది.

Next Story