'ఆర్ఆర్ఆర్' కొత్త ప్రోమో..కొమురం భీం సిద్ధం.. ట్రైల‌ర్‌పై అంచ‌నాలు పెరిగాయి

Jr NTR looks fierce as Komaram Bheem in new RRR promo.సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2021 7:45 AM GMT
ఆర్ఆర్ఆర్ కొత్త ప్రోమో..కొమురం భీం సిద్ధం.. ట్రైల‌ర్‌పై అంచ‌నాలు పెరిగాయి

సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్(రౌద్రం, ర‌ణం, రుధిరం)' ఒక‌టి. ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. దాదాపు రూ.450కోట్ల భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం జ‌న‌వ‌రి 7 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇక ఈ చిత్ర ట్రైల‌ర్‌ను రేపు విడుద‌ల చేయ‌నున్నారు.

ప్రేక్ష‌కుల ఆతృతకు మరింత ఎగ్జైట్మెంట్ ను జోడించడానికి, ప్రతి నిమిషం అభిమానులను ఉత్తేజపరిచేందుకు చిత్ర బృందం వ‌రుస అప్‌డేట్‌ల‌ను ఇస్తూ ఉంది. నిన్న మేకర్స్ వరుసగా రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ పాత్రల బీటీఎస్ వీడియోలను పంచుకున్నారు. తాజాగా మరో పవర్ ప్యాక్డ్ ప్రోమోను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నారు. 'బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్' అనే క్యాప్షన్ తో కొమురం భీమ్ ట్రైలర్ టీజ్ ను చరణ్ విడుదల చేశారు. ఎన్టీఆర్ బైక్ స్టార్ట్ చేసి దూసుకుపోవడం ఇందులో చూడొచ్చు. తల వరకు నీటిలో మునిగి భీమ్ ఎవరినో వేటాడటానికి రెడీగా ఉండటాన్ని సూచిస్తోంది. బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్ అనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో వచ్చిన ఈ వీడియో అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియోలు ట్రైల‌ర్ పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేశాయి.

Next Story
Share it