చెల్లమ్మా నికే చెప్తున నా మాట విను
JR NTR as a campaigner for Telangana police. సోషల్ అవేర్ నెస్ కార్యక్రమాలలో ముందుండే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలంగాణ పోలీసులకి ప్రచారకర్తగా మారారు.
By తోట వంశీ కుమార్ Published on 5 Jan 2021 12:01 PM ISTసోషల్ మీడియా వినియోగం ఎక్కువయ్యాక చాలా మంది ఫేస్‌బుక్ ప్రేమల బారిన పడి మోసపోయిన ఘటనలను చాలానే చూశాం. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగానే అవతలి వారు ఎలాంటి వారో తెలియకుండానే ఒకే అనేస్తున్నారు. దీంతో మోసగాళ్ల బారిన పడుతున్నారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పేరుతో అమ్మాయిల్ని బుట్టలో వేసుకుని, ఫోన్ నంబరు తీసుకుంటాయని, ఆపై ప్రేమ పేరుతో వారిని వంచించి డబ్బులు కావాలని.. ఇవ్వకుంటే వారి ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామడని వేదించడంతో.. కొంత మంది అమ్మాయిలు ఆత్మహత్యల వరకు వెలుతున్నారు. అయితే ఇలాంటి సైబర్ ప్రేమికుల ఉచ్చులో పడకూడదని పోలీసులు ఎన్ని సార్లు చెప్పిన కూడా ఇంకా ఎక్కడో ఓ చోట అలాంటి సైబర్ వేధింపులకి అమ్మాయిలు గురవుతూనే ఉన్నారు.
చెల్లమ్మా నికే చెప్తున నా మాట విను.
— Telangana State Police (@TelanganaCOPs) January 4, 2021
ఫేస్ బుక్ మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త. pic.twitter.com/GxVC9Zb6w2
సోషల్ అవేర్ నెస్ కార్యక్రమాలలో ముందుండే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలంగాణ పోలీసులకి ప్రచారకర్తగా మారారు.తాజాగా ఎన్ఠీఆర్ కి సంబంధించి ఒక వీడియోని వారు రిలీజ్ చేశారు. అందులో ఫేస్‌బుక్ ప్రేమలో పడి మోసపోవద్దు అని చూపించారు. ఈ ముఠాలు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పేరుతో అమ్మాయిల్ని బుట్టలో వేసుకుని, ఫోన్ నంబరు తీసుకుంటాయని, ఆపై ప్రేమ పేరుతో వల విసురుతాయని పోలీసులు ఆ వీడియోలో చూపించారు. కాస్తంత దగ్గరైన తర్వాత వాట్సాప్‌లో అభ్యంతరకర ఫొటోలను తెప్పించుకుంటాయని, అనంతరం రంగంలో కి దిగుతాయని పేర్కొన్నారు. ఆ ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారని, ఇవ్వకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారని వివరించారు.
కాబట్టి ఇలాంటి ఫేస్‌బుక్ పరిచయాలు, ప్రేమలకు దూరంగా ఉండాలని సూచిస్తూ పోలీసులు ఈ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను ప్రమోట్ చేసిన ఎన్టీఆర్.. ''చెల్లెమ్మా నా మాట విను.. ఫేస్‌బుక్ మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త'' అని హెచ్చరించాడు. మోసగాళ్ల బారినపడి ఎవరైనా బాధితులుగా మారితే ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని