అల్లుఅర్జున్ జర్నీ.. ర్యాప్ సాంగ్ రప్ఫాడిస్తోందిగా
Journey of Stylish Star Allu Arjun.గంగోత్రి చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు అల్లుఅర్జున్. అల్లుఅర్జున్ సినీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ ఓ ర్యాప్ సాంగ్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 12 Jan 2021 7:51 AM GMT'గంగోత్రి' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు అల్లుఅర్జున్. స్టైలిష్ స్టార్‌గా యూత్‌లో ఆయనకు ఉన్న క్రేజే వేరు. ఒక్క టాలీవుడ్‌లోనే కాదు మాలీవుడ్‌లోనూ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతేడాది వచ్చిన 'అలవైకుంఠపురములో' చిత్రంతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా అల్లుఅర్జున్ సినీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ ఓ ర్యాప్ సాంగ్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. సింగర్ రోల్‌రైడా పాడిన తెలుగోడి స్టైల్..మనమేలే బ్రాండ్ అంటూ సాగే ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. సంగీత దర్శకుడు తమన్ కంపోజ్ చేశాడు. ఈ పాటలో బన్ని మొదటి చిత్రం 'గంగోత్రి' నుంచి ఇటీవల వచ్చిన 'అలవైకుంఠపురములో' చిత్రం వరకు ఆయన పోషించిన పాత్రలు, పేల్చిన డైలాగులతో ఈ పాటను మలిచారు. మంచి బీట్‌తో ఆకట్టుకుంటున్న ఈ సాంగ్‌ను మీరు ఓ సారి చూసేయండి.
ఇదిలా ఉంటే.. 'అల వైకుంఠపురములో' సినిమా విడుదలై నిన్నటికి ఏడాది పూర‍్తయింది. ఈ సందర్భంగా ఆ సినిమా యూనిట్ మొత్తం నిన్న ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అల్లుఅర్జున్ మాట్లాడాడు. గత ఏడాది సంక్రాంతి అనంతరం ఏడాది మొత్తం ప్రపంచానికి బ్యాడ్ ఇయర్ గా నిలచిందని, అయితే తనకు మాత్రం అది బ్యాడ్ ఇయర్ కాదని చెప్పాడు. తన కెరీర్ మొత్తంలో ఇటువంటి విజయాన్ని తాను అందుకోలేదన్నాడు. ఈ చిత్రం విడుదలై ఏడాది గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఏదో ఒక విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉందని.. అందుకే 2020 తనకు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకమని చెప్పాడు.
పవన్ కల్యాణ్ కి ఏడో సినిమా 'ఖుషి' ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచిందని, జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఏడో సినిమా 'సింహాద్రి' , రామ్ చరణ్ కి రెండో సినిమా మగధీర ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిందన్నాడు. అందరికీ ఆల్ టైమ్ రికార్డ్ సినిమా ఉందని, అయితే, తనకెప్పుడు పడుతుందని తాను అనుకునేవాడిని చెప్పాడు. ఇందుకోసం తనకు 20 సినిమాలు పట్టిందని చెప్పాడు. అయితే, ఇది తన మొదటి అడుగు మాత్రమేనని.. ఇకపై తానేంటో చూపిస్తానన్నాడు.