పెళ్లి చేసుకున్న ‘జబర్దస్త్’ ప్రేమ జంట.. ఫోటోలు వైరల్
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాజేష్ తన ప్రేయసి జోర్దార్ సుజాత మెడలో మూడు ముళ్లు వేశాడు
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 12:56 PM ISTరాకింగ్ రాజేష్ తన ప్రేయసి జోర్దార్ సుజాత పెళ్లి ఫోటోలు
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాజేష్ తన ప్రేయసి జోర్దార్ సుజాత మెడలో మూడు ముళ్లు వేశాడు. గత కొంతకాలంగా ప్రేమ లోకంలో విహరిస్తున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. జనవరి నెలలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వీరు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి వివాహాం జరిగింది.
మంత్రి రోజా, యాంకర్ రవి, గెటప్ శీను తదితరులు వీరి పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను మంత్రి రోజా సోషల్ మీడియాలో షేర్ చేశారు. "నాకు అత్యంత ఆప్తులు నన్ను అమ్మా అని పిలిచే @jabardasthrakesh మరియు @jordarsujatha యొక్క సుఖ జీవనానికి హేతువైన మంగళ సూత్రంతో మాంగల్యాన్ని సుజాత మెడలో కట్టిన శుభగడియలో ఈ జంట నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో వర్ధిల్లుగాక అంటూ" రాసుకొచ్చారు.
ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త జంటకు నెటీజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన సుజాత.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ జోర్దార్ సుజాతగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్‌బాస్ రియాలిటీ షో లో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత జబర్దస్ కామెడీ షో లో రాకేశ్ స్కిట్లలో నటిస్తుంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరుకుటుంబాల అంగీకారంతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.