చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. జోధా అక్బర్ నటి కన్నుమూత
Jodha Akbar fame Manisha Yadav passed away.చిత్ర పరిశ్రమలో ఇటీవల వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా
By తోట వంశీ కుమార్ Published on
3 Oct 2021 6:55 AM GMT

చిత్ర పరిశ్రమలో ఇటీవల వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోగా.. అనారోగ్యం కారణంగా మరికొందరు కన్నుమూశారు. ఒకరి మృతిని జీర్ణించుకునే లోపే మరొకరు మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బిగ్‌బాస్ విన్నర్, బాలిక వధు సీరియల్ ఫేం సిద్ధార్థ్ శుక్లా మరణించిన విషయాన్ని మరిచిపోకముందే సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. 'జోధా అక్బర్' సీరియల్‌లో సలీమా బేగం పాత్రను పోషించిన నటి మనీషా యాదవ్ కన్నుమూసింది.
మెడుదులో రక్తస్రావం కారణంగా శుక్రవారం ఆమె కన్నుమూసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె సహా నటి పరిధి శర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మొఘల్స్ అనే పేరు ఉన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే అందులో షేర్ చేసుకుంటాం. శనివారం మనీషా మరణం గురించి గ్రూప్‌లో చూసి షాక్ గురయ్యాను. మనీషాకి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడని, ఆ బాబు పరిస్థితి గురించి ఆలోచిస్తేనే ఎంతో ఆందోళనగా ఉందని బాధని వ్యక్తం చేసింది. మనీషా యాదవ్ మృతి పట్ల పలువరు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Next Story