మరో సంచలనానికి నాంది పలికిన జియో సినిమా

ఐపీఎల్ ను ఉచితంగా స్ట్రీమింగ్ ఇస్తున్న 'జియో సినిమా'.. త్వరలో మరో సంచలనానికి నాంది పలికింది. ఇటీవలే జియో సినిమా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 April 2023 7:15 PM IST
JioCinema,  Warner Bros, HBO, Viacom18

మరో సంచలనానికి నాంది పలికిన జియో సినిమా 

ఐపీఎల్ ను ఉచితంగా స్ట్రీమింగ్ ఇస్తున్న 'జియో సినిమా'.. త్వరలో మరో సంచలనానికి నాంది పలికింది. ఇటీవలే జియో సినిమా యాప్ కోసం జియో స్టూడియోస్ దేశవ్యాప్తంగా 100కు పైగా సినిమాలు, ఎన్నో వెబ్ సిరీస్ లతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రముఖ ఓటీటీ వూట్ ని (Voot) జియో సినిమాస్ లో విలీనం చేశారు. ఇక భారతదేశంలో Warner Bros, HBO కంటెంట్ కూడా జియో సినిమాస్ టెలికాస్ట్ చేయనుంది. ఎన్నో సూపర్ హిట్ సిరీస్ లు జియో సినిమాస్ లో అందుబాటులోకి రానున్నాయి. IPL ని ఫ్రీగా టెలికాస్ట్ చేస్తున్న జియో సినిమాస్ మూవీ కంటెంట్ ని మాత్రం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ తో అందించనున్నారు.

లీకైన వివరాల ప్రకారం బేసిక్ ప్లాన్ కేవలం ఒక్కరోజుకు తీసుకునేవారికి 2 రూపాయలుగా జియో నిర్ణయించింది. ఇక మూడు నెలల ప్లాన్ గోల్డ్ ప్యాక్ పేరుతో రూ.99కి అందించనుంది. అలాగే ఏడాదికి అంటే 12 నెలల ప్యాక్ కేవలం రూ.599గా జియో అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఈ రేట్లను కంపెనీ అధికారికంగా నిర్థారించలేదు.

Next Story