తనపై విషప్రయోగం చేశారని జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు

జేడీ చక్రవర్తి సంచలన విషయాలు చెప్పారు. తనపై ఒకరు విషయ ప్రయోగం చేశారని పేర్కొన్నారు.

By Srikanth Gundamalla
Published on : 19 Jun 2023 11:39 AM IST

Slow Poison, JD Chakravarthy, Tollywood

తనపై విషప్రయోగం చేశారని జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు

జేడీ చక్రవర్తి ఒకప్పుడు హీరో.. కొన్నాళ్ల పాటు వరుస సినిమాలు తీసి ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత హీరోల వేషాలు తగ్గించి.. విలన్‌ పాత్రల్లో కూడా నటించారు. అలాగే డైరెక్షన్‌ చేశారు. కానీ.. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ఆయన పెద్దగా కనిపించలేదు. తాజాగా ఓ చానెల్‌కు ఇంటర్వూ ఇచ్చారు జేడీ చక్రవర్తి. ఈ సందర్బంగా సంచలన విషయాలు చెప్పారు. తనపై ఒకరు విషయ ప్రయోగం చేశారని పేర్కొన్నారు. కానీ.. అది చేసిందెవరో మాత్రం చెప్పలేదు.

జేడీ చక్రవర్తికి కొన్నాళ్ల క్రితం బ్రీతింగ్‌ ప్రాబ్లెమ్‌ వచ్చినట్లు చెప్పారు. అయితే తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. అయినా ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలియక చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చారు. ఊపరి పీల్చుకోవడం కూడా కష్టమయ్యేదని తెలిపారు. ఇక లాభం లేదనుకుని ఓ డాక్టర్‌ను కలిశానన్నారు. ఆయనకూ ఏం ఆర్థం కాలేదు.. ఆ తర్వాత కూడా మరికొందరు డాక్టర్లను కలిశానని వారు కూడా ఏం చెప్పలేకపోయారని తెలిపారు జేడీ. విదేశాల్లో చూపించినా కూడా లాభం లేకపోయిందన్నారు. ఒక దశలో ప్రాణాలపై ఆశలు కూడా వదులుకున్నట్లు ఆవేదన చెందారు. చివరకు తన డాక్టర్‌ వృత్తిలో ఉన్న తన ఫ్రెండ్‌ను కలిశానని.. ఆయన అన్ని టెస్టులు చేశారని చెప్పారు. అప్పుడు డ్రగ్స్‌ ఎందుకు తీసుకుంటున్నావని స్నేహితుడు తనని నేరుగా అడిగారని చెప్పారు. అయితే.. తాను ఇప్పటి వరకు ఎలాంటి డ్రగ్స్‌ తీసుకోలేదని.. ఒకప్పుడు కషాయం మాత్రం తాగేవాడినని తెలిపారు. అది ఆరోగ్యం కోసం ఒకరు తనతో తాగించేవారని ఓ ఇంటర్వ్యూలో అన్నారు జేడీ చక్రవర్తి.

ఆ కషాయం ద్వారానే తనపై విష ప్రయోగం చేసినట్లు లేట్‌గా గుర్తించానని తెలిపారు. తనకు ఇచ్చే కషాయం మిగతావారు తాగినప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని గుర్తు చేశారు. ఆ తర్వాత సదురు వ్యక్తిని గట్టిగా నిలదీసి అడిగాని జేడీ చక్రవర్తి అన్నారు. ఆ విషయంలో అతనికి జేడీకి చాలా కాలం పాటు గొడవలు అయ్యాయని చెప్పారు. విషప్రయోగం చేసింది ఎవరు.. ఎందుకు చేశారనే వివరాలు మాత్రం జేడీ చక్రవర్తి వెల్లడించలేదు. విష ప్రయోగంపై జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారాయి. తనపై విషప్రయోగం చేశారని జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు

Next Story