పవన్ వదిలిన 'జయమ్మ పంచాయితీ' ట్రైలర్

Jayamma Panchayiti Trailer out.యాంక‌ర్ సుమ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం జ‌య‌మ్మ పంచాయితీ. విజయ్ కుమార్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2022 7:26 AM GMT
పవన్ వదిలిన జయమ్మ పంచాయితీ ట్రైలర్

యాంక‌ర్ సుమ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'జ‌య‌మ్మ పంచాయితీ'. విజయ్ కుమార్ కలివరపు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ఎం ఎం కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మే 6న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్లు ఆకట్టుకోగా.. తాజాగా ట్రైల‌ర్ విడులైంది

శ‌నివారం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. 'రా బావా.. మా ఊరి పంచాయితీ చూద్దువు గానీ.. ఏ ఊర్లో లేని ఎరైటీ గొడ‌వ జ‌రుగుతోంది' అనే డైలాగ్ తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ఓ ప‌ల్లెటూరులో ఉండే మ‌హిళ జ‌య‌మ్మ‌. ఆమె కుటుంబానికి ఓ స‌మ‌స్య ఉంటుంది. త‌న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డానికి జ‌య‌మ్మ ఊరి పెద్ద‌ల ముందు పంచాయితీ పెడుతుంది. అదే స‌మ‌యంలో ఊరిని కూడా ఓ స‌మ‌స్య వేధిస్తుంటుంది. అస‌లు ఈ స‌మ‌స్య‌లు ఏంటి? అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Next Story
Share it