ఆక‌ట్టుకుంటున్న సుమ‌క్క 'జయమ్మ పంచాయితీ' ఫ‌స్ట్ లుక్‌

Jayamma Panchayithi first look.బుల్లితెర రారాణిగా వెలుగొందుతోంది సుమ క‌న‌కాల‌. బుల్లితెర‌పై ఇప్ప‌టికే స‌త్తాచాటిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2021 1:14 PM IST
ఆక‌ట్టుకుంటున్న సుమ‌క్క జయమ్మ పంచాయితీ ఫ‌స్ట్ లుక్‌

బుల్లితెర రారాణిగా వెలుగొందుతోంది సుమ క‌న‌కాల‌. బుల్లితెర‌పై ఇప్ప‌టికే స‌త్తాచాటిన యాంక‌ర్ సుమ వెండితెర‌పై కూడా హ‌వా కొన‌సాగించేందుకు సిద్ద‌మైంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ఓ చిత్రంలో న‌టిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర‌ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి 'జయమ్మ పంచాయితీ' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. టైటిత్‌తో పాటు పోస్ట‌ర్ కూడా చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది.

ఈ పోస్టర్లో సుమ పల్లెట్టూలో ఊరి పెద్దగా కనిపించింది. ఇక చుట్టూ వేర్వేరు కథలను చూపించారు. గ్రామంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా జయమ్మ పంచాయితీకి రావాల్సిందే అన్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది. సుమ 1996లో 'కళ్యాణ ప్రాప్తిరస్తు' అనే ఓ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్ రోల్‌లో సుమ న‌టిస్తోంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story