దయచేసి ఆమెను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయకండి: నటుడి సూచన

తమిళ నటుడు జయం రవి తన భార్యతో ఇటీవల విడాకులు ప్రకటించారు. చెన్నైలో జరిగిన ప్రెస్ ఈవెంట్‌లో గాయని కెనిషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్ల గురించి స్పందించారు.

By అంజి  Published on  22 Sept 2024 1:02 PM IST
Jayam Ravi, Kenishaa Francis, Dating Rumours, Divorce Battle

దయచేసి ఆమెను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయకండి: నటుడి సూచన

తమిళ నటుడు జయం రవి తన భార్యతో ఇటీవల విడాకులు ప్రకటించారు. చెన్నైలో జరిగిన ప్రెస్ ఈవెంట్‌లో గాయని కెనిషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్ల గురించి స్పందించారు. తన కొత్త చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో, జయం రవి మీడియాతో మాట్లాడుతూ తన డైవర్స్ కు సంబంధించి ఎవరినీ ప్రమేయం చేయవద్దు, వ్యక్తిగత జీవితం వ్యక్తిగతంగా ఉండనివ్వండని తెలిపారు. కెనిషా తనంతట తానుగా పైకి వచ్చిన వ్యక్తి.. ఆమె 600కి పైగా స్టేజ్ షోలు చేసింది. భవిష్యత్తులో కెనిషాతో కలిసి హీలింగ్ సెంటర్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు జయం తెలిపారు.

చాలా మందికి సహాయం చేయడానికి మేము హీలింగ్ సెంటర్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము. దయచేసి దానిని పాడుచేయవద్దని జయం రవి మీడియాను కోరారు. ఆమెను అనవసరంగా అలాంటి మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ చేయకండని జయం రవి కోరారు. కెనిషా ఫ్రాన్సిస్‌తో జయం రవి ఎఫైర్ గురించి కొన్ని తమిళ పత్రికలు రాశాయి. వారు తరచుగా గోవాలో కలుస్తున్నారని, వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని పలు పుకార్లు వచ్చాయి.

ఇక జయం రవి విడాకుల ప్రకటన తర్వాత, అతని మాజీ భార్య ఆర్తి తనకు తెలియకుండా, సమ్మతి లేకుండా ఇదంతా జరిగిందని చెప్పి పెద్ద బాంబ్ ను పేల్చింది.

Next Story