'సన్నాఫ్ ఇండియా'.. లిరికల్ వీడియో సాంగ్ వ‌చ్చేసింది

Jaya Jaya Mahaveera Lyrical video from Son of India.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2021 12:26 PM IST
సన్నాఫ్ ఇండియా.. లిరికల్ వీడియో సాంగ్ వ‌చ్చేసింది

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్తి చేసుకుంది. కొన్ని య‌థార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో మెహ‌న్‌బాబు విరూపాక్ష పాత్ర‌లో న‌టిస్తున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండ‌గా.. మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు విష్ణు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.

"జయ జయ మహావీర.. మహాధీర.. " అంటూ ఈ సాంగ్ సాగుతోంది. ఈ పాట‌లో కథానాయకుడు వేంకటేశ్వరస్వామి దీక్షా వస్త్రాలతో కనిపిస్తున్నాడు. భగవంతుడికి ఆయన చేసే ప్రార్ధనే ఈ సాంగ్. ఈ లిరికల్ వీడియోలోనే కథానాయకుడిలోని శాంత స్వభావాన్నీ .. ఆవేశాన్ని అవిష్కరించారు. రాహుల్ నంబియార్ స్వరంతో రూపుదిద్దుకున్న లిరికల్ వీడియో సాంగ్ ను బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ సాంగ్ ను షేర్ చేస్తూ 'భారతీయ సినిమా పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు .. ప్రముఖ తెలుగు నటుడు ఎం మోహన్ బాబు, మాస్ట్రో ఇళయరాజా కలిసి రాముడి శౌర్యానికి నివాళులర్పించిన 'రఘువీరా గద్యం'లోని సాంగ్ 'జయ జయ మహావీర' సాంగ్. ఆల్ ది బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు.

Next Story