'జవాన్' నుంచి 'నాట్ రామయ్యా వస్తావయ్యా' సాంగ్ రిలీజ్
కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ 'జవాన్'.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Aug 2023 5:29 PM IST'జవాన్' నుంచి 'నాట్ రామయ్యా వస్తావయ్యా' సాంగ్ రిలీజ్
కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ 'జవాన్'. హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ తో సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతోన్న ఈ సినిమానుంచి మంగళవారం 'నాట్ రామయ్యా వస్తావయ్యా' సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్ గా #AskSRK సెషన్ లో షారూఖ్ తన అభిమానులతో మాట్లాడుతూ 'నాట్ రామయ్యా వస్తావయ్యా' సాంగ్ గ్లింప్స్ ను విడుదల చేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీంతో మూడో సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తెరపడుతూ 'నాట్ రామయ్యా వస్తావయ్యా..' సాంగ్ విడుదలైంది.
ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు 'నాట్ వస్తావయ్యా'ను అద్భుతంగా తెరకెక్కించారు. పాట చూస్తుంటే పార్టీ నెంబర్ లా ఉంది. ప్రోమోలో షారూఖ్ ఎనర్జీ, ఛార్మ్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు సాంగ్ లో అది రెట్టింపుగా కనిపిస్తుంది. డాన్స్ మూవ్స్ ట్రెండ్ సెట్టింగ్ గా ఉన్నాయి. పాటను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మేకర్స్ విడుదల చేశారు. సాంగ్ పార్టీ వైబ్స్ తో అలరిస్తుంది.
హిందీ వెర్షన్ లో 'నాట్ రామయ్యా వస్తావయ్యా' పాటకు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. పాటకు కుమార్ సాహిత్యాన్ని అందించారు. అనిరుద్, విశాల్ డడ్లాని, శిల్పా రావు పాటను తమదైన స్టైల్లో అద్భుతంగా ఆలపించారు. వైభవ్ మర్చంట్ పాటకు కొరియోగ్రఫీని అందించారు. తెలుగు వెర్షన్ పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయగా శ్రీరామచంద్ర, రక్షిత సురేష్, అనిరుద్ పాడారు. ఇక తమిళ వెర్షన్ సాంగ్ కు వివేక్ సాహిత్యాన్ని అందించారు. అనిరుద్, శ్రీరామ్ చంద్ర, రక్షిత సురేష్ పాటను పాడారు.
షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.
This is not chaiya chaiya. This is #NotRamaiyaVastavaiya. This is a Jawan's tha tha thaiya. Thx @VishalDadlani, @shilparao11, @anirudhofficial, @kumaarofficial @VMVMVMVMVMThere are so many stories behind this song….but stories are for the 31st when the trailer comes… pic.twitter.com/YKsEhGd0JI
— Shah Rukh Khan (@iamsrk) August 29, 2023