జాతి రత్నాలు ట్రైల‌ర్‌.. ప‌డి ప‌డి న‌వ్వ‌డం ఖాయం

Jathi Ratnalu Official Trailer out. జాతి రత్నాలు ట్రైల‌ర్‌ ప్రభాస్ విడుదల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2021 5:44 PM IST
Jathi Ratnalu Official Trailer out

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా'తో టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకున్న న‌టుడు న‌వీన్ పొలిశెట్టి. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లాహ్ హీరోయిన్‌గా నటిస్తుండ‌గా.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్వ‌ప్ప సినిమాస్ ప‌త‌కంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. రాధ‌న్ సంగీతాన్ని అందిస్తుండ‌గా.. మార్చి 11 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ అభిమానులు ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు.

కాగా ఈ ట్రైలర్ విడుదల కోసం ముంబైలో ఉన్న ప్రభాస్ ను కలవడానికి వెళ్ళింది చిత్రబృందం. ఈ సందర్భంగా వారితో ప్రభాస్ సరదాగా కాసేపు గడిపారు. ప్రభాస్ మాట్లాడుతూ.. 'ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ట్రైలర్ తోనే ఇంత నవ్వుకున్నానంటే సినిమా చూస్తే ఎలా ఉంటాడో ఊహించగలను' అంటూ చెప్పుకొచ్చారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి ట్రైల‌ర్‌ను చూసేయండి.




Next Story