ఆస్కార్‌కు నామినేట్ అయిన జాతిర‌త్నాలు మూవీ..!

Jathi Ratnalu movie nominated for oscar.నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం జాతి ర‌త్నాలు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2021 4:46 PM IST
Jathi Ratnalu movie

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం జాతి ర‌త్నాలు. అనుదీప్ కెవి దర్శకత్వం వహించగా స్వప్న సినిమా బ్యానర్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈ మ‌ధ్య‌కాలంలో ఇంత‌లా న‌వ్వించిన చిత్రం మ‌రొక‌టి లేదంటూ బ్ర‌హ‌ర‌థం ప‌ట్టారు ప్రేక్ష‌కులు. ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో విజ‌యం సాధించింది ఈ చిత్రం. బాక్సాఫీసు వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. ఇటు తెలుగురాష్ట్రాల్లోనే కాక అమెరికాలోనూ స‌రికొత్త రికార్డులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఆస్మార్ అవార్డుకు నామినేష‌న్ ద‌క్కించుకుంది.

ఇందుకు సంబంధించిన స‌ర్టిఫికెట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ వైజ‌యంతి మూవీస్ ట్విట్ట‌ర్ పోస్ట్ చేసింది. బెస్ట్ జానే జిగ‌ర్ అనే కేట‌గిరి కింద ఈ చిత్రానికి నామినేష‌న్ ద‌క్కింద‌ని తెలియ‌జేసింది. అంద‌రికి శుభాకాంక్ష‌లు చెప్పింది. అయితే.. ఆస్మార్ నామినేష‌న్లు దాఖ‌లు స‌మ‌యం అయిపోయింద‌నే సంగ‌తి అంద‌రికి తెలిసిందే కదా. మ‌రీ ఇప్పుడు ఈ చిత్రం ఆస్మార్ నామినేష‌న్‌లో ఎలా నిలిచింది అనేగా మీ డౌట్‌.. మీ అనుమాన‌మే నిజం అండి. ఈ చిత్రం ఆస్మార్‌కు నామినేట్ కాలేదు. ఈ రోజు ఏప్రిల్ 1 క‌దా.. అదేనండి ఆల్ పూల్స్ డే క‌దా.. అందుక‌నే చిత్ర‌బృందం తెలుగు వారిని ఈ ర‌కంగా పూల్స్ చేశార‌న్న మాట‌.


Next Story