ప్రైమ్‌లో జాతిరత్నాలు వచ్చే డేట్&టైమ్ ఫిక్స్

Jathi Ratnalu gets OTT release date.జాతిరత్నాలు సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ తీసుకుంది. ఏప్రిల్‌ 11 నుంచి ప్రసారం కానున్నట్లు వెల్లడించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 5:55 PM IST
Jathi Ratnalu

జాతిరత్నాలు.. టాలీవుడ్ లో ఇటీవల వచ్చిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాలు నాన్ స్టాప్ గా నవ్విస్తూ ఎంటర్టైన్ చేశారు. చాలా రోజుల తర్వాత జోగిపేట్ నుండి వచ్చిన జాతి రత్నాలు కడుపుబ్బా నవ్వించారు. డైరెక్టర్‌ అనుదీప్‌ ప్రమోషన్స్ ను కూడా ఒక సెపరేట్ వే లో తీసుకుని వెళ్ళాడు. ఇక ఈ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకుని వచ్చింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి విజయం సాధించింది.


చిత్ర బృందం అమెరికాలో కూడా సక్సెస్ టూర్ ను నిర్వహించింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు పూర్తీ అయ్యింది. ఇక డిజిటల్ రిలీజ్ కు దగ్గర పడింది. కరోనా కారణంగా థియేటర్‌కు వెళ్లలేక పోయిన వారు డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. థియేటర్ లోనే కాదు.. ఇంట్లో కూడా హాయిగా చూసుకోవచ్చని పలువురు భావిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ తీసుకుంది. తాజాగా వారికి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో శుభవార్త చెప్పింది. జాతిరత్నాలు సినిమా ఏప్రిల్‌ 11 నుంచి ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఇక సినిమాను హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు.


Next Story