ఓటీటీలోకి జాన్వీ కపూర్ సినిమా

జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావ్ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి' సినిమా మే 31న విడుదలై బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది.

By అంజి  Published on  26 July 2024 6:30 PM IST
Janhvi Kapoor, movie, Mr and Mrs Mahi, OTT

ఓటీటీలోకి జాన్వీ కపూర్ సినిమా 

జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావ్ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి' సినిమా మే 31న విడుదలై బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 కోట్ల గ్రాస్ వసూలు చేయగలిగింది. భారీ ప్రమోషన్లు చేసినప్పటికీ.. ప్రేక్షకులలో పెద్దగా ప్రభావాన్ని సృష్టించలేకపోయింది.

థియేటర్లలో పరాజయం తర్వాత.. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ హక్కులను పొందింది. ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా హిందీలో ప్లాట్‌ఫారమ్‌ లోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో మిస్టర్ అండ్ మిసెస్ మాహి ఓటీటీలోకి వచ్చేసిందని తెలిపింది.

శరణ్ శర్మ మిస్టర్ అండ్ మిసెస్ మాహి సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో తన భార్య క్రికెటర్ గా ఎదగడానికి ఆమె భర్త చేసే ప్రయాణం.. వారిద్దరి మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా థియేట్రికల్ విడుదల మిశ్రమ సమీక్షలను పొందింది.. ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Next Story