తిరుమలలో సందడి చేసిన జాన్వీ కపూర్.. ఆ వ్యక్తి ఎవరంటే?

Janhvi Kapoor Visits Tirupati Balaji Temple. తిరుమలలో జాన్వీ కపూర్ సందడి చేసింది. ఆమె ఓ వ్యక్తితో కలిసి తిరుమల దర్శనం చేసుకుంది.

By M.S.R  Published on  3 April 2023 6:22 PM IST
తిరుమలలో సందడి చేసిన జాన్వీ కపూర్.. ఆ వ్యక్తి ఎవరంటే?

తిరుమలలో జాన్వీ కపూర్ సందడి చేసింది. ఆమె ఓ వ్యక్తితో కలిసి తిరుమల దర్శనం చేసుకుంది. తిరుమలకు జాన్వీ కపూర్ ఇప్పటికే చాలా సార్లు వచ్చింది. వీలు దొరికినప్పుడల్లా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటూ ఉంటుంది. ఈసారి జాన్వీతో కలిసి వచ్చిన వ్యక్తి ఎవరా అని ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు.

జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని తన బోయ్ ఫ్రెండ్ తో కలిసి సోమవారం దర్శించుకుంది. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా శ్రీవారి సన్నిధి వద్ద సోమవారం ఉదయం కనిపించారు. న్వీతోపాటు, ఆమె సోదరి ఖుషీ కపూర్ స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసిన వీడియో వైరల్ అవుతోంది. జాన్వీ కపూర్ లంగా ఓణి లో కనిపించింది. శిఖర్ పహారియా తెల్లటి పంచె, రెడ్ స్క్రాఫ్ లో కనిపించాడు. వీరి వెంట ఖుషీ కపూర్ కూడా ఉంది. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. జాన్వీతో అతడు ఎంతో కాలంగా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. జాన్వీ కపూర్ తొలిసారి తెలుగులో నటిస్తోంది. ఎన్టీఆర్-కొరటాల సినిమాలో హీరోయిన్ గా చేయబోతోంది.


Next Story