బాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. దివంగ‌త న‌టి శ్రీదేవి కూతుర్ల‌కు క‌రోనా

Janhvi Kapoor and sister Khushi Kapoor tested Covid-19 positive.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2022 3:25 PM IST
బాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. దివంగ‌త న‌టి శ్రీదేవి కూతుర్ల‌కు క‌రోనా

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడా లేకుండా అంద‌రికి ఈ వైర‌స్ సోకుతోంది. ఇక చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఈ మ‌హ‌మ్మారి వ‌ద‌ల‌డం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండ‌స్ట్రీల‌కు చెందిన న‌టీన‌టులు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే మంచు మ‌నోజ్‌, మంచు ల‌క్ష్మీ, మ‌హేష్‌బాబు, స‌త్య‌రాజ్, విష్ణు విశాల్ వంటి న‌టులు క‌రోనా బారిన ప‌డ‌గా తాజాగా ఆ జ‌బితాలోకి దివంగ‌త న‌టి శ్రీదేవి కూతుర్లు చేరారు. న‌టి జాన్వీక‌పూర్‌తో పాటు ఆమె సోద‌రి ఖుషి క‌పూర్‌కి పాజిటివ్‌గా తేలింది.

ఈ విష‌యాన్ని జాన్వీక‌పూర్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. జ‌న‌వ‌రి 3వ తేదీని త‌న‌కి, త‌న సోద‌రికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింద‌ని చెప్పింది. తొలి రెండు రోజులు క‌ష్టంగానే గ‌డిచిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఇద్ద‌రు కోలుకుంటున్న‌ట్లు తెలిపింది. ఇక అభిమానులకు ఓ విజ్ఞ‌ప్తి చేసింది. అంద‌రూ ఖ‌చ్చితంగా మాస్క్‌లు ధ‌రించ‌డంతో పాటు టీకాలు వేసుకోవాల‌ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది.


జాన్వీ కపూర్ ఇలా వ్రాశారు, "హే అబ్బాయిలు! కాబట్టి నేను మరియు మా సోదరి జనవరి 3న కోవిడ్-19 కోసం పాజిటివ్ పరీక్షించాము. మేము ఇప్పుడు BMC అవసరమైన హోమ్ ఐసోలేషన్ రోజులను పూర్తి చేసాము మరియు ఇద్దరికీ ప్రతికూల పరీక్షలు చేసాము. మొదటి రెండు రోజులు కఠినంగా ఉన్నాయి, ఆపై ప్రతి రోజు మెరుగ్గా ఉంది. ఈ వైరస్ నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఏకైక మార్గం ముసుగులు వేసుకోవడం మరియు టీకాలు వేయడం! అందరూ జాగ్రత్త వహించండి!!"

Next Story