ఇది కళాకారుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి.. పూజా హెగ్డే

దళపతి విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’ సెన్సార్ ప్రక్రియలో జాప్యం కారణంగా విడుదల కాలేకపోతూ ఉంది.

By -  Medi Samrat
Published on : 11 April 2026 6:00 PM IST

ఇది కళాకారుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి.. పూజా హెగ్డే

దళపతి విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’ సెన్సార్ ప్రక్రియలో జాప్యం కారణంగా విడుదల కాలేకపోతూ ఉంది. ఆన్‌లైన్‌లో లీక్ కావడం కోలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. హీరోయిన్ పూజా హెగ్డే తన బాధను వ్యక్తం చేసింది. వెండితెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు వేలాది మంది టెక్నీషియన్లు పడే కష్టం ఈ ఒక్క లీక్‌తో నాశనం అవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక సినిమాకు జరిగిన నష్టం కాదని, కళాకారుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని పూజా అభిప్రాయపడింది. చిత్ర నిర్మాణ సంస్థ లీకులకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలకు దిగింది. క్లిప్పులను ప్రసారం చేసే సోషల్ మీడియా ఖాతాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.

Next Story