నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గే.. జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్

Jaibalayya Mass anthem is out from Veerasimha reddy Movie.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2022 6:11 AM GMT
నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గే..  జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' . గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాసన్ న‌టిస్తోంది. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈచిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ ను ఇచ్చింది చిత్ర‌బృందం. ఫ‌స్ట్ సింగిల్ 'జై బాల‌య్య 'మాస్ ఆంథెమ్‌ను విడుద‌ల చేసింది.

"రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు" అంటూ మొదలైన ఈ పాట బాల‌య్య అభిమానుల‌ను ఉర్రూత‌లూగిస్తుంది. ఈ పాట‌ను రామ‌జోగయ్య శాస్త్రి రాయ‌గా క‌రీముల్లా పాడారు. వైట్ అండ్ వైట్ డ్రస్ లో, మీసం మెలేసి, మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్,స్టైలిష్ గాగుల్స్‌ తో బాలయ్య లుక్ అద్భుతంగా ఉంది.

ఈ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. రాయ‌లసీమ బ్యాక్‌ డ్రాప్‌లో జరిగిన వాస్తవ అంశాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ యాక్టర్‌ ధునియా విజ‌య్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. కేజీఎఫ్ అవినాష్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.

Next Story
Share it