'డాడీ ప్లీజ్ తిరిగిరా.. నీ కూతురి దగ్గరికి'.. రీతూ చౌదరి ఎమోషనల్‌

Jabardasth Actress Rithu Chowdary Emotional Post About Her Father Death. జబర్దస్‌ లేడీ కమెడియన్‌ రీతూ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి

By అంజి  Published on  24 Jan 2023 6:31 AM GMT
డాడీ ప్లీజ్ తిరిగిరా.. నీ కూతురి దగ్గరికి.. రీతూ చౌదరి ఎమోషనల్‌

జబర్దస్‌ లేడీ కమెడియన్‌ రీతూ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ విషయాన్ని రీతూ చౌదరి వెల్లడించారు. ఇన్‌స్టాలో తన తండ్రి ఇక లేడన్న విషయాన్ని చెబుతూ భావోద్వేగపూరిత నోట్‌ను స్టోరీలో పెట్టారు. తన తండ్రితో చివరిసారిగా దిగిన ఫొటోను స్టోరీలో పెట్టి ఎమోషనల్‌ అయ్యారు. మొదటగా టిక్‌ టాక్‌ వీడియోలతో రీతూ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సీరియల్స్‌లో నటిస్తూ తన కెరీర్‌ మొదలు పెట్టిన రీతూ చౌదరి.. ఆ తర్వాత జబర్దస్త్‌ షోలో అడుగు పెట్టి కమెడియన్‌ పేరు తెచ్చుకుంది.

''నాన్న నిన్ను చాలా మిస్‌ అవుతున్నాను. ఆ ఫోటో తీసుకునే సమయంలో ఇలా పోస్ట్‌ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నీతో తీసుకున్న లాస్ట్‌ ఫోటో ఇదే నాన్న. నన్ను ఎలా వదిలి వెళ్లిపోయావు నాన్న? నువ్వు లేకుండా నేను ఉండలేను. డాడీ ప్లీజ్ తిరిగిరా.. నీ కుతురు దగ్గరికి'' అంటూ రీతూ చౌదరి ఎమోషనల్‌ నోట్‌ను ఇన్‌స్టాలో పెట్టారు. ప్రస్తుతం ఈ నోట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు జబర్దస్‌ కమెడియన్స్‌, ప్రేక్షకులు ఆమెకు సానుభూతి తెలుపుతున్నారు. 'అమ్మ కోసం', 'ఇంటి గుట్టు' వంటి పలు సీరియల్స్‌లో నటించిన రీతూ చౌదరి.. ఆ తర్వాత జబర్దస్‌కి వెళ్లి కమెడియన్‌గా సెటిల్‌ అయిపోయింది.

Next Story