'నేడు నా డెత్ డే'.. రామ్‌గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న ట్వీట్

Ramgopal varma sensational tweet."నేడు నా పుట్టిన రోజు కాదు. ఇది నిజానికి నా డెత్ డే. ఎందుకో తెలుసా? నా ఆయుష్షులో మరో సంవత్సరం తగ్గిపోయింది" అంటూ ట్వీట్ చేశాడు వ‌ర్మ‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 11:03 AM IST
Ramgopal varma

నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇటీవ‌ల కాలంలో సినిమాల కంటే ఎక్కువ‌గా ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నేడు(ఏప్రిల్ 7) ఆయ‌న పుట్టిన రోజు. దీంతో సినీ రంగానికి చెందిన వారితో ప‌లువురు అభిమానులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఏ రోజు ఎలా స్పందిస్తాడో తెలియ‌ని వర్మ‌.. ఈ రోజు త‌న‌దైన శైలిలో చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారింది.


"నేడు నా పుట్టిన రోజు కాదు. ఇది నిజానికి నా డెత్ డే. ఎందుకో తెలుసా? నా ఆయుష్షులో మరో సంవత్సరం తగ్గిపోయింది" అంటూ ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. ఏడుపుమొహం ఎమోజీలను పోస్ట్‌ చేశాడు. కాగా.. వ‌ర్మ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్ అయ్యింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వ‌ర్మ నీకు నువ్వే సాటి అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా.. అయ్యో వ‌ర్మాజీ మీరు ఎంత అదృష్ట‌వంత‌లు.. మీ డెత్ డే మీకు తెలిసిపోయిందా..? అంటూ మ‌రికొంద‌రు వ్యంగ్యంగా ట్వీట్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం.. 'ఆర్టీవీ దెయ్యం' అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు వ‌ర్మ‌. ఇదిలా ఉంటే.. ఆర్‌జీవీ బ‌యోపిక్ త్వ‌ర‌లో రానుంది. ఇది మూడు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. తొలి భాగంలో వేరే న‌టుడు రాంగోపాల్ వ‌ర్మ పాత్ర‌లో న‌టించ‌నుండ‌గా.. రెండు, మూడు భాగాల్లో వ‌ర్మ‌నే స్వ‌యంగా న‌టించ‌నున్నాడు. ఇక ఈ బ‌యోపిక్‌లో త‌న‌కు మాపియా ఉన్న లింకుల‌తో పాటు త‌న శృంగార కార్య‌క‌లాపాల‌ను అన్నీ చూపిస్తాన‌ని అప్ప‌ట్లోనే చెప్పాడు వ‌ర్మ‌. దీంతో వీటిలో ఏం చూపించ‌నున్నాడో అని ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది.


Next Story