ఆసక్తిగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ట్రైలర్‌

Itlu Maredumilli Prajaneekam trailer out.అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Nov 2022 10:09 AM IST
ఆసక్తిగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్‌

అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం'. ఏఆర్ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అల్ల‌రోడి స‌ర‌స‌న ఆనంది న‌టిస్తోంది. అల్ల‌రి న‌రేష్ కెరీర్‌లో 59వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడీయోస్‌, హాస్య మూవీస్ ప‌తాకంపై రాజేశ్ దండు నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు సినిమాపై ఆస‌క్తిని పెంచ‌గా.. తాజాగా చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. "ఇంకో నాలుగు రోజుల్లో ఎల‌క్ష‌న్స్ మీ ఊర్లో జ‌రగ‌బోతున్నాయి" అని అల్ల‌రి న‌రేష్ చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ఆద్యంతం ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది.

అడవి ప్రాంతంలో ఉండే ఊరికి అల్లరి నరేష్‌ ఎలక్షన్‌ అధికారికగా వెళ్తాడు. అయితే.. రాజకీయ నాయకులు అక్కడి ప్రజలను ఓట్లు గానే చూస్తుంటారు. మ‌నుషులుగా చూడ‌రు. క‌నీస అవ‌స‌రాల‌కు సాయం కూడా చేయ‌రు. నరేష్‌ ఆ ఊరు ప్రజలతో కలిసి రాజకీయ నాయకులలో ఏ విధంగా మార్పు తెచ్చాడు అనే క‌థాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతోంది.

Next Story