న‌టి తాప్సీ, ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ నివాసాల్లో ఐటీ సోదాలు

IT dept raids premises linked to Anurag Kashyap and Tapsee Pannu.ముంబైలోని బాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్‌పై ఐటీ దాడులు కొన‌సాగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 March 2021 9:26 AM GMT
IT dept raids premises linked to Anurag Kashyap and Tapsee Pannu

ముంబైలోని బాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్‌పై ఐటీ దాడులు కొన‌సాగుతున్నాయి. నిర్మాత‌ మ‌ధు మంతెన‌, న‌టి తాప్సీ, ద‌ర్శ‌కుడు వికాస్ బెహ‌ల్ నివాసాలు‌, ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ కు ‌చెందిన ఫాంట‌మ్ ఫిల్మ్స్‌, టాలెంట్ హంట్ కంపెనీ కార్యాల‌యాల్లో ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీరితో పాటు మ‌రికొంత మంది బాలీవుడ్ ప్ర‌ముఖుల ఇండ్ల‌లోనూ ఐటీశాఖ సోదాలు నిర్వ‌హిస్తున్న‌ది. ప‌న్ను ఎగ‌వేత ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఈ సోదాలు చేస్తున్న‌ట్లు తెలిపారు. ముంబై, పుణె ఏక‌కాలంలో 22 చోట్ల ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఈ దాడుల‌కు సంబంధించిన మ‌రితం స‌మాచారం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో తాప్సీ, అనురాగ్ క‌ళ్య‌ప్‌లు యాక్టివ్‌గా ఉంటారు. ప‌లు విష‌యాల‌పై త‌మ స్పంద‌న‌లు తెలియ‌జేస్తుంటారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్న రైతుల‌కు అనుకూలంగా వీరు గ‌తంలో ట్వీట్లు చేశారు. కాగా.. ఇదే విష‌యంలో న‌టి తాప్సీ, కంగ‌నా ర‌నౌత్‌ల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ న‌డిచిన సంగ‌తి తెలిసిందే.
Next Story