ముఖాలను గుర్తు పట్టలేకపోతున్నానంటున్న నటి

Ishq Vishk fame Shenaz Treasury diagnosed with prosopagnosia.షెనాజ్ ట్రెజరీ.. ప్రముఖ ట్రావెల్ బ్లాగర్, నటి తాను అరుదైన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jun 2022 6:00 AM GMT
ముఖాలను గుర్తు పట్టలేకపోతున్నానంటున్న నటి

షెనాజ్ ట్రెజరీ.. ప్రముఖ ట్రావెల్ బ్లాగర్, నటి తాను అరుదైన సమస్యతో బాధపడుతూ ఉన్నానని తెలిపింది. మంగళవారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'ప్రొసోపాగ్నోసియా' తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. ప్రజల ముఖాలను గుర్తుంచుకోవడంలో తనకు సమస్యలు ఉండేవని, అయితే వారి వాయిస్ వినడం ద్వారా వాటిని గుర్తుంచుకుంటానని చెప్పుకొచ్చింది. షెనాజ్ 2003లో విడుదలైన ఇష్క్ విష్క్‌లో అలీషా పాత్రను పోషించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో "నాకు ప్రోసోపాగ్నోసియా 2 ఉన్నట్లు నిర్ధారణ అయింది. నేను ఎప్పుడూ ముఖాలను ఎందుకు గుర్తుపట్టలేకపోయే దాన్నో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ముఖాలను గుర్తించలేనందుకు బాధపడుతూ ఉన్నాను. నేను స్వరాలను గుర్తించగలను" అని చెప్పుకొచ్చింది. "ప్రోసోపాగ్నోసియా సంకేతాలు మరియు లక్షణాలు. 1. మీరు సన్నిహిత మిత్రుడిని లేదా కుటుంబ సభ్యుడిని గుర్తించడంలో విఫలమవ్వడం. ఎదుట ఉన్న వ్యక్తి ఎవరో గుర్తు చేసుకోవడానికి నాకు ఒక నిమిషం పడుతుంది. కొన్నిసార్లు నేను సన్నిహితులను, స్నేహితులని కూడా గుర్తించడంలో విఫలం అవుతూ ఉంటాను" అని తెలిపింది.

"మీకు ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, సహోద్యోగులు, క్లయింట్లు, స్కూల్‌మేట్‌లను గుర్తించడం కష్టం. మీకు తెలిసిన వ్యక్తులు మీరు వారిని గుర్తించాలని ఆశిస్తారు. ఒకరిని గుర్తించడంలో విఫలమైతే మీరు వారికి దూరమైనట్లు అనిపించవచ్చు. చాలా మంది ఇతరులను గుర్తించడంలో విఫలమైనందున వారిని కించపరిచినట్లు నివేదించారు. ఇందులో నేను కూడా ఉన్నాను." అని షెనాజ్ తెలిపింది.

"సినిమాల్లోని నటుల విషయంలో కూడా గందరగోళానికి గురవుతూ ఉంటానని" షెహనాజ్ తెలిపింది. 'రెండు పాత్రలు ఒకే ఎత్తు, హెయిర్ స్టైల్ కలిగి ఉంటే నేను తేడాను గుర్తించలేను' అని చెప్పింది. నా సమస్యను అర్థం చేసుకోండి.. నా మైండ్ లో ఇలాంటి సమస్య ఉందని గుర్తుంచుకోండి అని చెప్పుకొచ్చింది. షెనాజ్ ప్రస్తుతం ట్రావెల్ బ్లాగర్‌గా పనిచేస్తోంది. ఆమె షాహిద్ కపూర్ నటించిన ఇష్క్ విష్క్ చిత్రంతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. ఆమె తరువాత ఉమర్, ఆగే సే రైట్, రేడియో, లవ్ కా ది ఎండ్, ఢిల్లీ బెల్లీ మరియు అనేక ఇతర చిత్రాలలో కనిపించింది.

Next Story
Share it