ఆసక్తిని రేకెత్తిస్తున్న 'ఇష్క్' మూవీ ట్రైలర్

Ishq theatrical trailer out.యంగ్ హీరో తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా న‌టిస్తున్న చిత్రం "ఇష్క్" ట్రైలర్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2021 5:51 AM GMT
Ishq

యంగ్ హీరో తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా న‌టిస్తున్న చిత్రం "ఇష్క్". 'నాట్ ఎ లవ్ స్టోరీ' అనేది ట్యాగ్ లైన్. మలయాళంలో ఘ‌న విజయం సాధించిన 'ఇష్క్' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తోన్నారు. సౌత్ ఇండియాలోని పెద్ద బ్యానర్లలో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత విరామం తర్వాత మళ్ళీ తెలుగులో నిర్మిస్తున్న సినిమా ఇది కావ‌డంతో మూవీపై అంచనాలు పెరిగాయి. యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో నేడు చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. హీరో, హీరోయిన్స్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. హీరోహీరోయిన్ కారులో బీచ్ రోడ్ లో వెళ్తుండగా ఏం జరిగిందనే విషయాన్నీ సస్పెన్స్ లో ఉంచి ఆసక్తిని రేకెత్తించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా 'ఇష్క్' ట్రైలర్ ను ఓ సారి చూసేయండి.


Next Story