'ఇష్క్' రిలీజ్ డేట్ ఫిక్స్

Ishq movie release date Fix. ఇష్క్ చిత్ర విడుద‌ల తేదీతో పాటు ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2021 6:07 PM IST
Ishq movie

యంగ్ హీరో తేజ స‌జ్జా మ‌ల‌యాళ భామ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'ఇష్క్‌'. 'నాట్ ఎ ల‌వ్ స్టోరీ' అనేది ట్యాగ్‌లైన్‌. య‌స్‌.య‌స్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ ప‌తాకంపై ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్వీప్ర‌సాద్‌-పార‌స్‌జైన్‌-వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ఫ‌స్టులుక్, పోస్ట‌ర్స్ సినిమాపై అంచాన‌ల‌ను పెంచాయి. తాజాగా ఉగాదిని పుర‌స్క‌రించుకుని ఈ చిత్ర విడుద‌ల తేదీతో పాటు ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.

ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా వదిలిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. తేజ సజ్జా - ప్రియా ప్రకాశ్ వారియర్ వేరు వేరు తలుపుల నుండి బయటకు వస్తుండగా మధ్యలో ఒక కారు ఉండేలా ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఇదిలా ఉంటే.. న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన‌ 'ట‌క్ జ‌గ‌దీష్' ఏప్రిల్ 23న విడుద‌ల కావాల్సి ఉండ‌గా..కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ‌ది. ఇదే తేదీన తేజ స‌జ్జ 'ఇష్క్' చిత్రం విడుద‌ల కాబోతుంది.




Next Story