ఇష్క్ ఫస్ట్‌ లుక్.. లవ్ స్టోరీ కాదంట‌

Ishq movie First look released.బాల‌న‌టుడిగా మెప్పించి హీరోగా మారాడు తేజ స‌జ్జా. ఆయ‌న హీరోగా న‌టించిన ఇష్క్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2021 12:32 PM IST
Ishq movie First look released

బాల‌న‌టుడిగా మెప్పించి హీరోగా మారాడు తేజ స‌జ్జా. ఆయ‌న హీరోగా న‌టించిన తొలి చిత్రం 'జాంబిరెడ్డి' ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'ఇష్క్‌'. నాట్ ఏ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్‌. 'చెక్' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ఈ చిత్రంలో క‌థానాయిక‌. తాజాగా ఇష్క్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్ పారస్ జైన్ వాకాడ అంజన్ కుమార్ నిర్మిస్తున్నారు. మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా.. ఈ పోస్ట‌ర్‌లో హీరో తేజ కాస్త సీరియ‌స్‌గా క‌నిపిస్తుండ‌గా.. హీరోయిన్ ప్రియా వారియ‌ర్ న‌వ్వుతా క‌నిపిస్తుండ‌గా.. గ్లాసులు ముక్కలు గాలిలో ఎగిరిప‌డున్న‌ట్లు క‌నిపిస్తుంది. నూతన దర్శకుడు ఎస్ఎస్ రాజు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ ఫ‌స్టులుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తేజ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం. గతంలో ఇష్క్ టైటిల్ తో నితిన్ మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఇష్క్ కూడా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




Next Story