హీరో విశాల్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడానికి గతంలో ఆయనకు అయిన కంటి గాయమే కారణమని తెలుస్తోంది. ఓ సినిమా షూటింగ్‌లో విశాల్ కంటికి దెబ్బ తగిలింది. దాని వల్ల శరీరంలోని నరాలు దెబ్బతిన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ గాయమే తిరగబెట్టడంతో విశాల్ సరిగా చూడలేకపోతున్నారని, వణుకుతున్నారని సమచారం. తాను నటించిన 'మదగజరాజ' ఈవెంట్‌లో ఆయన సన్నబడిపోయి, చేతులు వణుకుతూ కనిపించారు. వేదిక వద్దకు వచ్చే క్రమంలోనూ సరిగ్గా నడవలేకపోయారు.
అందరూ ఆయనను పరామర్శిస్తుండటం కూడా కనిపించింది. హీరో విశాల్ గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 'మదగజరాజ' మూవీ 2013లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రిలీజ్ అవుతోంది. మరోవైపు ఆయన ఆరోగ్యంపై చెన్నై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.