మీనా భర్త మృతికి అదే కారణమా..?
Is the pigeon’s remnant the reason for Meena’s husband’s dying.ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన విషయం
By తోట వంశీ కుమార్ Published on 29 Jun 2022 1:17 PM ISTప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా.. ఆయన హఠాన్మరణంపై పలు అనుమానాలు మొదలయ్యాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఎక్కువగా పీల్చడం వచ్చే విద్యాసాగర్ తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారని స్థానిక మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
మీనా నివాసం ఉంటే ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉంటాయని, వాటికి విద్యాసాగర్ తరచూ ధానా వేస్తూ అక్కడే గడిపేవాడని ఆ కథనాల్లో పేర్కొన్నారు. వాటి వ్యర్థాల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్లే ఆయనకు శ్వాస కోస సమస్యలు తలెత్తాయని, ఈ క్రమంలో కరోనా సోకిన సమయంలో విద్యాసాగర్ ఊపిరితిత్తులు పాడైపోయాయని, ఇందుకు సంబంధించి కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారని ఆయా పత్రికల్లో కథనాలు ప్రచురితం అయ్యాయి. ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ.. దాతలు దొరక్కపోవడంతో విద్యాసాగర్ మృతి చెందారని సమాచారం.
2009లో విద్యాసాగర్‌ను మీనా పెళ్లి చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ దంపతులకు నైనికా అనే కూతురు ఉంది. నైనికా ఇప్పటికే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తలపతి విజయ్ హీరోగా వచ్చిన 'తేరీ' చిత్రంలో, అరవింద్ స్వామి 'భాస్కర్ ఓరు రాస్కెల్' చిత్రంలో బాలనటిగా నటించి మెప్పించింది.