సలార్ సినిమా 'ఒరిజినల్ కథ'.. ఫిక్స్ అయిపోండి..!
ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కన్నడ సూపర్ హిట్ మూవీ 'ఉగ్రం' కు రీమేక్ అని కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
By Medi Samrat Published on 12 Dec 2023 9:30 PM ISTప్రభాస్ హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కన్నడ సూపర్ హిట్ మూవీ 'ఉగ్రం' కు రీమేక్ అని కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.అయితే గతంలో ఈ వార్తలు దర్శకుడు ప్రశాంత్ నీల్ వరకు వెళ్లడంతో.. ఆయన కూడా స్పందించారు. సలార్ సినిమా ఒరిజినల్ కథతో వస్తుందని తెలిపారు. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదు. ఈ కథ కేవలం ప్రభాస్ కోసం తయారు చేసశామని క్లారిటీ ఇచ్చేశాడు. రిలీజ్ దగ్గర పడుతుండటంతో మరోసారి సలార్ రీమేక్ న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ వార్తలపై సలార్ నిర్మాత విజయ్ కిరగందూర్ స్పందించారు. సలార్ మూవీపై వస్తున్నవన్నీ బేస్ లెస్ రూమర్స్ అని తెలిపారు. సలార్ సినిమా ఏ సినిమాకు రీమేక్ కాదు. ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారన్నారు. ప్రభాస్ ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా సలార్ లో చూస్తారు. ఆయన నుండి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ సలార్ లో ఉంటాయని.. డిసెంబర్ 22న సలార్ దెబ్బకు రికార్డ్స్ బద్దలవడం ఖాయం అంటూ చెప్పుకొచ్చారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సలార్: సీజ్ ఫైర్’ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు ‘ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్ 2గంటల 55నిమిషాలు ఉంది. ఇటీవల వచ్చిన ‘యానిమల్’ మూడు గంటలకు పైగా నిడివి ఉన్నప్పటికీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి రికార్డులు సృష్టిస్తోంది. దీంతో ‘సలార్’ యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను 2.55గంటలు థియేటర్లో కూర్చోబెట్టేలానే ఉంటాయని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.