అప్పు చివరి క్షణాలు.. వీడియో వైరల్..!
Is it the last minute CCTV footage of actor Puneeth Rajkumar.కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్29
By తోట వంశీ కుమార్ Published on 3 Nov 2021 2:51 PM ISTకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్29(శుక్రవారం)న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఈ లోకం వదిలి నాలుగు రోజులు కావస్తున్నా కూడా.. ఆయన అభిమానులు కన్నడిగులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఏ వీధి, ఏ దుకాణం వద్ద చూసినా.. తమ అభిమాన నటుడు అప్పుకు నివాళులర్పిస్తున్న ఫ్లెక్సీలే దర్శనం ఇస్తున్నారు. ఎంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండే పునీత్ కి గుండెపోటు ఎలా వచ్చిందని అభిమానులు కంటతడి పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆయన ఆఖరి ఘడియలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పునీత్ చివరి సారి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం ఒంట్లో నలతగా ఉందని భార్య అశ్వినితో కలిసి అప్పు ఆస్పత్రికి బయలుదేరిన వీడియో అది.
శుక్రవారం ఉదయం జిమ్ చేసిన తర్వాత గుండెల్లో అసౌకర్యంగా ఉండడంతో.. తన భార్య అశ్వినితో కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఆస్పత్రికి వెళ్లారు పునీత్. ఈ వీడియోలో పునీత్ యాక్టీవ్ గానే ఉన్నారు. కారు వద్దకు కూడా యాక్టీవ్ గానే నడుస్తూ వెళ్లారు. అప్పు కారు వద్దకు నడుచుకుంటూ వెళ్లడం అక్కడ సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.