నాని 'ట‌క్ జ‌గ‌దీష్' నుంచి రొమాంటిక్ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

Inkosaari Inkosaari​ Lyrical song released from tuck jagadish.పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని తన నటనతో ప్రేక్షకులను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2021 10:44 AM IST
నాని ట‌క్ జ‌గ‌దీష్ నుంచి రొమాంటిక్ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి న్యాచుర‌ల్ స్టార్‌గా ఎదిగాడు. 2020 లో నాని " వి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లాక్ డౌన్ వేళ ఓటీటీ లో విడుదల అయిన ఈ సినిమా అభిమానులను నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమా "టక్ జగదీష్". ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నానికి సరసన నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి రొమాంటిక్ లిరిక‌ల్ సాంగ్ ను విడుద‌ల చేశారు. "ఇంకోసారి ఇంకోసారి" అంటూ నాని రీతూ వ‌ర్మ‌ల‌పై సాగే ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌ను శ్రేయా గోష‌ల్, కాల‌బైర‌వ ఆల‌పించ‌గా.. త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. 'నిన్నుకోరి` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన చిత్ర అప్‌డేట్‌తో సినిమాపై అంచనాల‌ను పెంచేసింది చిత్ర బృందం. ఏప్రిల్ 16న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఇంకెందుకు ఆల‌స్యం ఈ పాట‌ను మీరు ఓసారి వినేయండి.




Next Story